2 Countries Movie Audio Launch event held at Hyderabad. Nani, Sunil, Deepa Naidu, Gopi Sundar, N Shankar, BVS RAvi, Dasarath, Raja Ravindra, Bhaskarabhatla, Y Kasi Viswanath, Prudhvi Raj, Srinivasa Reddy, Anil Ravipudi, Gemini Kiran, Malkapuram Shivakumar at the event.
సునీల్, మనీషా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం 2 కంట్రీస్. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.... నాకు సునీల్ అన్న అంటే చాలా ఇష్టం. ‘ఢీ' సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రికమండ్ చేసింది సునీల్ అన్నే. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చాను అని నాని తెలిపారు.
సునీల్ అన్న రికమండ్ చేస్తే అసిస్టెంటుగా చేరిన నేను ఆయన నటించిన ఈ సినిమా ఈ వెంటులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంటర్టెన్మెంట్ సైడ్ ఎలాగూ సునీల్ అన్నయ్య అదరగొడతాడు. కంటెంట్ సైడ్ చూస్తే ‘2 కంట్రీస్' అనేది మలయాళంలో చాలా పెద్ద సక్సెస్. కంటెంట్ తప్పకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని నాని తెలిపారు.